అతడు 20 కేజీల బరువు తగ్గితే టీంలోకి తీసుకుంటా.. ధోని సరదా వ్యాఖ్య

  • 2018 ఆసియా కప్ మ్యాచ్‌ తరువాత ధోనితో అఫ్ఘన్ ప్లేయర్ అస్ఘర్ సరదా సంభాషణ
  • తన సహచర ప్లేయర్ షహ్జాద్ ధోనికి పెద్ద ఫ్యాన్ అని తెలిపిన అస్ఘర్
  • షహ్జాద్ 20 కేజీలు తగ్గితే టీంలో తీసుకుంటానంటూ ధోనీ కామెంట్
  • కానీ, షహ్జాద్ ఆ తరువాత మరో 5 కేజీల బరువు పెరిగాడన్న అస్ఘర్
భారత్‌ క్రికెట్‌కు దక్కిన మేటి కెప్టెన్లలో ఎమ్ఎస్ ధోనీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. అతడి మార్గదర్శకత్వంలో ఎందరో యువ క్రీడాకారులు అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నారు. అయితే, ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ మాజీ కెప్టెన్ అస్ఘర్ ఆఫ్ఘన్ తనకు, ధోనీకి మధ్య జరిగిన ఓ సరదా సంభాషణ గురించి చెప్పుకొచ్చాడు.  

‘‘2018 ఆసియా కప్‌లో ఇండియా వర్సెస్ ఆప్ఘనిస్థాన్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆ తరువాత ధోనీ, నేను కాసేపు మాట్లాడుకున్నాం. ధోని ఓ గొప్ప కెప్టెన్. భారత క్రికెట్‌కు అతడు దేవుడిచ్చిన బహుమతి. ఆ సందర్భంగా నేను ముహమ్మద్ షహ్జాద్ గురించి కూడా చెప్పాను. షహ్జాద్ మీకు చాలా పెద్ద ఫ్యాన్ అని నేను ధోనీతో అన్నాను. అయితే, షహ్జాద్‌ది భారీ కాయమని, అతడు ఓ 20 కేజీల బరువు తగ్గితే తాను అతడిని ఐపీఎల్‌లో తీసుకుంటానని ధోని సరదాగా వ్యాఖ్యానించాడు. కానీ సిరీస్ తరువాత షహ్జాద్‌ మరో ఐదు కేజీల బరువు పెరిగాడు’’ అని అస్ఘర్ నాటి ఫన్నీ ఉదంతాన్ని గుర్తు చేసుకున్నాడు.

MS Dhoni
Afghanistan
Team India
Cricket

More Telugu News